Mopal Police Station | శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం..

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Mopal Police Station | సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతి రెడ్డి (MLA bhupathi reddy) అన్నారు. మోపాల్ (Mopal) మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఏసీపీ ప్రకాష్, సీఐ సురేష్, ఎస్సై సుస్మిత, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.

Mopal Police Station | పోలీస్​స్టేషన్​ నిర్మాణానికి..

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ నిర్మాణంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు తమవంతుగా సహకారం అందించడం అభినందనీయమన్నారు. కాగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తనవంతుగా రూ.10 లక్షలు కేటాయించారు. పోలీస్ స్టేషన్ అంటే కేవలం పోలీసులది మాత్రమే అనే అపోహను ప్రజలు వీడాలని, అది ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేయబడిందని తెలియజేశారు.

అందరి సహకారంతో పోలీస్ స్టేషన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకొని త్వరలోనే ప్రారంభించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోపాల్ సాయి రెడ్డి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు జలందర్, స్థానిక సర్పంచ్ రవి, మాజీ ఎంపీపీ యాదగిరి, ప్రతాప్ సింగ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Vijay OSD | వెనక్కి తగ్గిన విజయ్​.. ఓఎస్​డీ నియామకం రద్దు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *