అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy | తాను దేశ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2034 వరకు సీఎంగా ఉంటానని, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారు.
తన జీవితంలో ఇప్పటి వరకు తాను అనుకున్నట్లే జరిగిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. జెడ్పీటీసీ (ZPTC) నుంచి సీఎంగా ఎదిగిన తీరును వివరించారు. తాను జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అవ్వాలని అనుకున్నానని, సాధించానని చెప్పారు. ఎంపీ అవ్వాలనుకున్నా 2014లో కుదర్లేదన్నారు. 2019లో అదే స్థానం నుంచి గెలిచానని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే సీఎం అవుతానని చెప్పానని, చెప్పినట్లుగానే అయ్యాయని పేర్కొన్నారు. 2034లో తెలంగాణలో కాంగ్రెస్ (Congress)ను గెలిపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని పేర్కొన్నారు.
Revanth Reddy | బండి భగీరథ్‌ను తీసుకు రావాలి
పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని రేవంత్‌రెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి సెక్షన్లు పెట్టారని, వెంటనే నోటీసులు ఇవ్వగా అప్పటికే అతడు పరారీలో ఉన్నారని చెప్పారు. కొడుకు మీద కేసు అయితే బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాలా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి తక్షణమే తన కుమారుడిని విచారణకు తీసుకు రావాలని సూచించారు. కీలకమైన పదవిలో ఉన్న ఆయన హుందాగా వ్యవహరించాలన్నారు. కొడుకు తీరుతో బండి సంజయ్‌కు తలవంపులు వచ్చాయని పేర్కొన్నారు.
Revanth Reddy | రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ప్రధాని కావాలని లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీని కేంద్రంలో అధికారంలోకి తేవాలని మాత్రమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీకి ప్రధాని కావాలని గోల్ ఉండాలని తానే ఒప్పించానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తమ ప్రధాని అభ్యర్థి అని పేర్కొన్నారు. తెలంగాణలో ఏదో కేస్ అయిందట చూడు అని రాహుల్ గాంధీ తనకు మెసేజ్ చేశారన్నారు. తెలంగాణలో జరిగే ప్రతి విషయంపై ఆయన ఫోకస్ చేస్తారని, దానిని తనతో పంటుకుంటారన్నారు.
దీనిని కూడా చదవండి : Indiramma Houses | వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన


