నిజామాబాద్Wheel Accident in Exhibition | ఎగ్జిబిషన్​లో ప్రమాదం.. విరిగిన క్రేజీ వీల్​ ట్రాలీ..

Wheel Accident in Exhibition | ఎగ్జిబిషన్​లో ప్రమాదం.. విరిగిన క్రేజీ వీల్​ ట్రాలీ..

నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​లో ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్భన్​: Wheel Accident in Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానం (Polytechnic Ground)లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​లో ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆహ్లాదంను అందించాల్సిన ఎగ్జిబిషన్​ సందర్శకులను ఇబ్బందులను గురిచేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం రాత్రి క్రేజీవీల్​ ట్రాలీ ఊడిపడి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

Wheel Accident in Exhibition | పెరిగిన సందర్శకుల తాకిడి..

నగరంలో ఏర్పాటు చేసిన నుమాయిష్​కు జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. వేసవి సెలవుల దృష్ట్యా సందర్శకుల తాకిడి ఎక్కవగానే ఉంటుంది. అయితే నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పదిరోజుల క్రితం ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. తాజాగా ఆదివారం నుమాయిష్​లో ఏర్పాటు చేసిన క్రేజీ వీల్​ ట్రాలీ రన్నింగ్​లోనే విరిగి కింద పడడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో ఓ వ్యక్తి కిందపడ్డ తర్వాత ట్రాలీలోనే కొద్దిసేపటి వరకు ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు.

Wheel Accident in Exhibition

Wheel Accident in Exhibition | కనీస వైద్య సదుపాయాలు కరువు..

ఎగ్జిబిషన్​కు వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే ఆ ప్రాంతంలో కనీస వైద్యసదుపాయాలు సైతం ఏర్పాటు చేయలేదని సందర్శకులు ఆరోపిస్తున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే వెంటనే ప్రథమ చికిత్స (First Aid) చేసేందుకు సైతం ఎలాంటి ఏర్పాటు చేయలేదని వారంటున్నారు.

ఇది కూడా చదవండి..: Heart Attack | కువైట్​లో గుండెపోటుతో వేల్పూర్​ వాసి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు కొనసాగుతున్న మరమ్మతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...