Paddy Procurement Centers | ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అధికారులు..‘అక్షరటుడే’ కథనానికి స్పందన

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Procurement Centers | ‘లారీలు రావు.. ధాన్యం పోదు’ శీర్షికతో మంగళవారం ‘అక్షర టుడే’లో (Akshara today) ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ధాన్యం(paddy procurement) తరలించేందుకు తగినన్ని లారీలను ఏర్పాటు చేస్తామని లింగంపేట్(Lingampet) తహశీల్దార్ సురేష్, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు నర్సింలు హామీ ఇచ్చారు. బుధవారం వారు సంయుక్తంగా మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.

Paddy Procurement Centers | కల్లాల వద్దకు వెళ్లి.. రైతులతో మాట్లాడి..

కల్లాల (Paddy Procurement) వద్దకు నేరుగా వెళ్లి రైతులతో మాట్లాడిన అధికారులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను (grain transportation) వెంటనే గోదాములకు తరలించేందుకు లారీలను పంపిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రవాణా, హమాలీ ఛార్జీల పేరుతో రైతుల నుండి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను తహశీల్దార్ సురేష్ హెచ్చరించారు. ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, తూకంలో తేడాలు రాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని సైతం నిబంధన ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు.

12 2

ఇది కూడా చదవండి: Hyderabad Child Murder | రెండో పెళ్లికి అడ్డని.. ఆరేళ్ల చిన్నారిని కడతేర్చిన కసాయి తల్లి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *