అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Land Pattas | ధరణి కష్టాలు తొలగించి, అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అన్నారు. దీంతో తాము అధికారంలోకి వచ్చాక రైతులకు చుట్టం లాంటి భూ భారతి (Bhu Bharati) పోర్టల్ తీసుకొచ్చామని తెలిపారు. నాడు గడీల పెత్తనంలో బందీ అయిన భూ రికార్డులను విడిపించి, భూములపై పేదలకే సర్వాధికారాలు కల్పించే దిశగా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతేగాకుండా జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరును ప్రారంభిస్తామని తెలిపారు.
Land Pattas | భూ సమస్యలు పరిష్కరిస్తాం
సత్తుపల్లి పట్టణ పరిధిలోని 399 సర్వే నంబర్ అంశంతో పాటు, చుట్టుపక్కల 9 గ్రామాల్లో ఉన్న దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యల ను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. పేదపల్లి, నారాయణపురం పరిసరాల్లోని 5,500 ఎకరాల పైచిలుకు భూములను సర్వే చేసి, కబ్జాలో ఉన్న అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, పహానీలలో వారి పేర్లు ఎక్కించాలని ఆదేశించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పొందిన రైతులు బోర్లు వేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు పెట్టవద్దని సూచించారు.
దీనిని కూడా చదవండి : Telangana Minimum Wages | కార్మికులకు సీఎం గుడ్న్యూస్.. కనీస వేతనాలు పెంపు


