అక్షరటుడే, బోధన్: Bodhan Task Force Raid | మీసేవ కేంద్రం ముసుగులో నకిలీ ధృవపత్రాల తయారీ జరుగుతోందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటన బోధన్ (Bodhan) పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.
Bodhan Task Force Raid | పట్టణంలోని రాకాసిపేట్‌లో..
బోధన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు రాకాసిపేట్‌లోని ఓ మీసేవ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాల్లో పలు అనుమానాస్పద పత్రాలతో పాటు కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో లభించిన పత్రాలు, రికార్డులు, కంప్యూటర్‌కు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి వసీం, ముక్రం అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఏ రకమైన ధృవపత్రాలు తయారు చేశారు.. వాటిని ఎక్కడ, ఏ అవసరాలకు వినియోగించారు.. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా.. అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పరిశీలన అనంతరం మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: భారత్‌లో మరో 100 ఎయిర్‌పోర్ట్‌లు..!