Kamareddy Stray Dogs | అక్షరటుడే ఎఫెక్ట్.. వీధికుక్కల సమస్యపై స్పందించిన కలెక్టర్​

పట్టణంలో వీధికుక్కల బెడద కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Stray Dogs | పట్టణంలో వీధికుక్కల బెడద కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై శుక్రవారం ‘వీధుల్లో శునక గండం’ శీర్షికన ‘అక్షరటుడే’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ స్పందించారు.

Kamareddy Stray Dogs | వీధికుక్కల సంరక్షణకు రెండెకరాల స్థలం..

కలెక్టరేట్​లో జిల్లా పాలనాధికారి శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాటు ఘటనల నివారణకు జిల్లాస్థాయి సంస్థల ప్రాంగణాల భద్రతా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో వీధి కుక్కల కోసం జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి 2 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను గుర్తించి, ప్రతి సంస్థకు నోడల్ అధికారిని నియమించాలని, అవసరమైన చోట్ల ఫెన్సింగ్, ప్రహరీలు, గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Kamareddy Stray Dogs | అన్నిశాఖల సమన్వయం..

Kamareddy Stray Dogs

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని శాఖల జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, తమకు కేటాయించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డా. ఎం. భరత్, సహాయ సంచాలకులు డా. దేవేందర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. మోనికా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Rural Police | రూరల్​లో పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *