అక్షరటుడే, మెదక్ : Peddamma Temple | మెదక్ (Medak) జిల్లా హవేళి ఘనపూర్ మండలం తొగిట గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభం అయ్యాయి.
వేడుకల్లో భాగంగా తొలిరోజు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. మహిళలు ఇళ్ల నుంచి బోనాలను తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం పెద్దమ్మ ఆలయంలో విఘ్నేశ్వర పూజ, స్వస్తి హవాచనం, దేవతా స్థాపన, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం హోమం, ఆదివారం విగ్రహా ప్రతిష్ఠాపన నిర్వహించనున్నారు. అదే రోజు పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణం, పెద్దమ్మ బోనాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Pulse Polio | అందోల్–జోగిపేటలో పల్స్ పోలియో