క్రైంKamareddy Theft Scare | కామారెడ్డిలో దొంగల సంచారం.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

Kamareddy Theft Scare | కామారెడ్డిలో దొంగల సంచారం.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

కామారెడ్డి పట్టణంలో దొంగల సంచారం కలకలం రేపుతోంది. శివారు కాలనీల్లో అపరిచిత వ్యక్తులు అర్ధరాత్రి తర్వాత చేతిలో ఆయుధాలతో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft Scare | కామారెడ్డి పట్టణంలో (Kamareddy City) దొంగల సంచారం కలకలం రేపుతోంది. శివారు కాలనీల్లో అపరిచిత వ్యక్తులు అర్ధరాత్రి తర్వాత చేతిలో ఆయుధాలతో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

Kamareddy Theft Scare | జయశంకర్​ కాలనీలో..

ఇటీవల పట్టణంలో దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. లిక్కర్ మార్ట్(Liquor Mart), షాపులు, ఇళ్లలో భారీ చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతికత ఆధారంగా చోరీలకు పాల్పడుతున్న దొంగలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. అయినా దొంగల సంచారం పెరుగుతూనే ఉంది. తాజాగా జయశంకర్ కాలనీలో దొంగలు కలకలం సృష్టిస్తున్నారు.

దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ అర్ధరాత్రి వేళలో దొంగతనానికి పాల్పడేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు(Kamareddy Police) సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఇదే కాలనీలో భారీ దొంగతనాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. వేసవికాలం దృష్ట్యా సెలవులు ఉండడంతో పలువురు ఇళ్లకు తాళాలు వేసి టూర్లు, సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగతనాలకు పాల్పడేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్​లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి వేళలో శివారు కాలనీల్లో పోలీస్ గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Ponguleti Paper Controversy | మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన పొంగులేటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Car Stunts | కార్లతో స్టంట్లు.. షాక్​ ఇచ్చిన పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Car Stunts | హైదరాబాద్​ (Hyderabad)...

Armoor Lorry Accident | ఆర్మూర్​లో లారీ బీభత్సం.. కారును ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు..

అక్షరటుడే,ఆర్మూర్ : Armoor Lorry Accident | పట్టణంలో లారీ బీభత్సం...

Udhayanidhi Stalin | పదవుల కోసం వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్​ : ఉదయనిధి స్టాలిన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Udhayanidhi Stalin | డీఎంకే (DMK) లీడర్​,...

Shamshabad Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు కలకలం..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shamshabad Bomb Threat | శంషాబాద్‌లోని (Shamshabad) రాజీవ్...