Car Bike Collision | కారు బైక్ ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు..

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Car Bike Collision | కారు, బైక్ ఢీకొని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి (Gandhari) మండలంలోని బుగ్గ గండి వద్ద ఆదివారం చోటు చేసుకుంది.

Car Bike Collision | బుగ్గ గండి వద్ద..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని బుగ్గ గండి వద్ద ఆదివారం కామారెడ్డి (Kamareddy) నుంచి బాన్సువాడ వెళ్తున్న కారు.. మేడిపల్లి గ్రామం నుంచి వస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్​పై వెళ్తున్న గాంధారి మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమాన్ నాయక్ తండాకు చెందిన గంగా సింగ్ ఆయన తల్లి యమునకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. స్పందించిన పైలట్ గోవర్ధన్, ఈఎంటీ కమలాకర్ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి (Kamareddy GGH) తరలించారు. పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

108

ఇది కూడా చదవండి: RTC Bus CCTV Cameras | ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *