అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bakrid Celebrations | జిల్లాలో బక్రీద్‌ను (Bakrid) గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే ఉద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.
Bakrid Celebrations | ఖిల్లా ఈద్గా వద్ద..
నగరంలోని (Nizamabad City) ఖిల్లా ఈద్గా వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈద్గా అధ్యక్షుడు అబ్దుల్ రహ్మాన్, మెంబర్ ఎహశాన్ పాషా, ట్రెజరర్ ఇనాయత్ అలీ, మోల్సాబ్ ముఫ్తీ సయీద్ అక్బర్ ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. ఎండాకాలం దృష్ట్యా ప్రత్యేకంగా షామియానాలు వేసి, తాగునీటి సౌకర్యం కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా అంబులెన్స్‌ను ఉంచారు. సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రార్థనా స్థలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పహారా కాశారు. ఈ సందర్భంగా సీపీ ఖిల్లా ఈద్గా, బోధన్‌లోని ఈద్గాలను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు.

ఇది కూడా చదవండి: Dong Gongping Escape | రబ్బరు బోటులో 30 గంటల జర్నీ.. చైనా మాజీ పోలీస్ సాహసం


