Monsoon Preparedness | వానాకాలం సీజన్​లో అధికారులు సమన్వయంతో పనిచేయాలి..: సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Monsoon Preparedness | వానాకాలం అత్యవసర పరిస్థితుల్లో(Monsoon Preparedness) అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో (Police Commissionerate Office) మాన్​సూన్​ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Monsoon Preparedness | భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. భారీవర్షాలు, ఆకస్మిక వరదలు, చెరువులు, వాగులు పొంగిపొర్లినప్పుడు పోలీస్​ శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారులు దెబ్బతింటాయని.. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీస్​శాఖ చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీస్​శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్​స్టేషన్ పరిధిలో వరదలకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు.. ప్రమాదకర వంతెనలు, వాగులు, చెరువులు, కాలువలు, జలాశయాలు, కూలిపోయే అవకాశం ఉన్న పురాతన ఇళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Monsoon Preparedness | హెచ్చరిక బోర్డులు ఏర్పాటు..

Nizamabad CP Transfer

భారీ వర్షాలు కురిసే సమయంలో (Heavy Rain Alert) ట్రాఫిక్ అంతరాయం కలిగే ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు.. అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని, వరద నీటిలో ప్రజలు, వాహనాలు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.

లైఫ్ జాకెట్లు, రోప్​లు, టార్చిలైట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల (Disaster Response) సమయంలో జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, వైద్య, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో నిజామాబాద్​, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, పీసీఆర్​ ఇన్​స్పెక్టర్​ వీరయ్య, సీఐలు, ఎస్​హెచ్​వోలు, ఐటీ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

police 8

ఇది కూడా చదవండి: Palamuru Irrigation Projects | కమీషన్ల కోసమే వేల కోట్లు దోచుకున్నారు.. బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *