Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Kavitha Remarks | రాష్ట్రంలో కేటీఆర్​ పాలన నడుస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు

Balla Sandeep Kumar
Last updated: June 6, 2026, 2:51 pm 2:51 pm
Balla Sandeep Kumar
Share
Kavitha Remarks

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Remarks | తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో అప్పుడు కేటీఆర్ పాలనే ఉంది. ఇప్పుడు కేటీఆర్ (KTR) పాలనే ఉందని కవిత అన్నారు. గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు అని పేర్కొన్నారు. ఇప్పుడు కేటీఆర్ పాలన అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని
విమర్శించారు. సీఎం సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. వాళ్ల భూ దందాలను వరుస బెట్టి ఆధారాలతో సహా బయటపెడతా అన్నారు. కాంగ్రెస్​కు ఇదే ఆఖరి సర్కార్ అని విమర్శించారు. 20 ఏళ్లు ఆ పార్టీని బొందపెట్టే పనులను రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు.

Kavitha Remarks | భూ దోపిడీ

బీఆర్ఎస్ ఉన్నప్పుడు భూ దోపిడికి కిటికీలు తెరిస్తే రేవంత్ రెడ్డి (Revanth Reddy) తలుపు తెరిచారని కవిత విమర్శించారు. ప్రాణం పోయినా సరే తెలంగాణలో ఇంచు భూమిని దోపిడీ చేయనివ్వనని పేర్కొన్నారు. గతంలో ఫినిక్స్ సంస్థకు బీఆర్ఎస్ 50 ఎకరాల వరకు ధారాధాత్తం చేస్తే ఇదే ముఖ్యమంత్రి అప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మరో వంద ఎకరాలు కలిసి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Kavitha Remarks | తెలంగాణ మా జాగీరే..

Kavitha Remarks

ఆంధ్రా విష కోరల్లోంచి తెలంగాణను సాధించుకున్నాం.. కచ్చితంగా తెలంగాణ మా జాగీరే అని కవిత అన్నారు. తెలంగాణ భూములను రక్షించేందుకు భూపోరాటాలు చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా లీగల్ ఫైట్ చేస్తామన్నారు. అప్పులు పుట్టం లేదంటూ ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ అవసరాలకు భూమి ఎట్ల అని ఆమె ప్రశ్నించారు. ఆదిత్య బిల్డర్స్​ వాళ్లు మూసీ గర్భంలో పెద్ద బిల్డింగ్ కడుతున్నారని కవిత ఆరోపించారు. ఆ సంస్థపై చర్యలు తీసుకునే దమ్ముందా.. అని హైడ్రాకు సవాల్​ చేశారు.

Kavitha Remarks | చెరువులో భూములు కొన్న పవన్

తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినకుండా బాధపడిన పవన్ కళ్యాణ్ ఆ బాధలో ఇక్కడ భూములు కొన్నారని ఎద్దేవా చేశారు.కానీ అది కోడికుంట అనే చెరువులో 10 ఎకరాల శిఖం భూమినే కొన్నారని ఆరోపించారు. ఇది శిఖం భూమియే అని ఇరిగేషన్ శాఖ నోటిఫై కూడా చేసిందన్నారు. కానీ రిజిస్ట్రేషన్​లో చాలా తప్పులు చేశారని ఆరోపించారు. వెంటనే ఆ భూమి రిటర్న్ ఇచ్చేయాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: ACB raids Kakinada | కాకినాడలో ఏసీబీ కలకలం: కోట్ల అక్రమాస్తులతో చిక్కిన రెవెన్యూ అధికారి శివరాం కుమార్

TAGGED:brs newsKalvakuntla KavithaKavitha RemarksKTRLand IssuesRevanth ReddyTelangana NewsTelangana Politics
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Footpath Encroachments Footpath Encroachments | కూకట్​పల్లిలో ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు
Next Article Nizamabad Medical College | Nizamabad Medical College | మెడికల్​ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కలకలం రేపిన ఘటన
1 Comment
  • Pingback: Waqf Board Inspector Bribe | వక్ఫ్​బోర్డు ఇన్​స్పెక్టర్​..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Indiramma Houses
తెలంగాణ

Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు అప్పుడే.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

By Balla Sandeep Kumar
RTC Driver Death
తెలంగాణ

RTC Driver Death | ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి!

By Naresh Chandan
Junior Lecturers
తెలంగాణ

Junior Lecturers | జూనియర్ లెక్చరర్ల సర్వీస్ కౌంట్ చేస్తూ జీవో విడుదల

By Srinivas Kolluri
Rains in Telangana
తెలంగాణ

Rains in Telangana | తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం..

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.