అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Fish Medicine | జిల్లాలో మృగశిరకార్తెను (Mrigasira Karte) ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరంలోని (Nizamabad) పెద్ద బజార్లో చిన్నారులకు చేపమందు పంపిణీ చేశారు.
Fish Medicine | బోధన్ రోడ్డులో..
నగరంలోని బోధన్ రోడ్డులో (Bodhan road) పాత థియేటర్ పక్కన షాప్లో ఎండీ హైమద్ చేపమందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దగ్గు (Cough), దమ్ము పక్షవాతం (Paralysis) ఉన్నవారికి ఈ చేపమందు ద్వారా ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను సమారు 40ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నుంచే కాకుండా గ్రామాల నుంచి సైతం ప్రజలు ఈ చేపమందు కోసం తరలివచ్చారు.

ఇది కూడా చదవండి: Stock Market Losses | ముదురుతున్న పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో మార్కెట్లు
