అక్షరటుడే,హైదరాబాద్ : Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు సంబంధించి హైకోర్టు (High Court) వెలువరించిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఘాటైన రీతిలో స్పందించారు. న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మమే జయిస్తుందని ఈ తీర్పుతో మరోసారి నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు.
Harish Rao | హరీశ్‌రావు హర్షం :
ప్రాథమిక హక్కులు , సహజ న్యాయ సూత్రాలను పక్కనబెట్టి సాగించిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టడంపై హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని కోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు.
Harish Rao | కుట్రలు బట్టబయలయ్యాయి:
ఈ తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పన్నిన రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలను హైకోర్టు తీర్పు ఎండగట్టిందని ధ్వజమెత్తారు.

తప్పుడు ప్రచారాలు మానుకోవాలని:
ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలు , తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ప్రభుత్వానికి హరీశ్‌రావు సూచించారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లోని రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి, తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
సత్యమేవ జయతే..
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఏ శక్తులు అడ్డుపడినా తెలంగాణ ప్రజల పాలిట కాళేశ్వరం ప్రాజెక్టు ‘ప్రాణేశ్వరం’ అని హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. “సత్యమేవ జయతే” అంటూ ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.
ఇది కూడా చదవండి..: RTC Strike | సమ్మె విరమించండి.. కార్మికులను కోరిన మంత్రి పొన్నం

