Hyderabad Metro Rush | తిరుమల క్యూలైన్​లను తలపించిన మెట్రో స్టేషన్లు.. వీడియో వైరల్

హైదరాబాద్​ నగరంలో మంగళవారం సాయంత్రం మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. వర్షంతో ట్రాఫిక్​ జామ్​ కావడంతో ప్రజలు మెట్రోను ఆశ్రయించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro Rush | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. వాన దంచికొట్టడంతో రోడ్లు జలమయం అయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ట్రాఫిక్​ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు మెట్రోను ఆశ్రయించారు. దీంతో మంగళవారం సాయంత్రం మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. స్టేషన్లలో ప్రయాణికులు బారులు తీరారు. తిరుపతి క్యూలైన్ల మాదిరిగా ప్రజలు స్టేషన్లలో లైన్​లో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hyderabad Metro Rush | ఇళ్లకు వెళ్లే సమయంలో..

Hyderabad Metro Rush

విధులు ముగించుకొని ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో వరుణుడు తన ప్రతాపం చూపాడు. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్​ జామ్​ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్‌పేట్, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో 15 నిమిషాల ప్రయాణానికి 3 నుండి 4 గంటల సమయం పట్టింది. దీంతో బైక్‌లు, కార్లు ఉన్నవారు సైతం వాటిని ఆఫీస్ పార్కింగ్‌ల్లోనే వదిలేసి మెట్రో స్టేషన్ల (Metro stations)కు పరుగులు తీశారు. దీంతో మెట్రో స్టేషన్​లో జనజాతరను తలపించాయి.

ఇది కూడా చదవండి..: Wife Shot Dead | భార్యను గన్​తో కాల్చి చంపిన భర్త

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *