Kavitha Law and Order | రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది: కవిత

తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని తెలంగాణ రక్షణ సేన అధినేత, మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Law and Order | తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని తెలంగాణ రక్షణ సేన అధినేత, మాజీ ఎమ్మెల్సీ కవిత ( Kavitha ) ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువైందని, నిత్యం దాడులు, అత్యాచార ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు.

Kavitha Law and Order | ఖమ్మం ఘటన..

ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేసిన ఘటన అత్యంత దారుణమని, ఇది అందరినీ కలచివేసిందని అన్నారు. జిల్లా కేంద్రానికే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక మారుమూల ప్రాంతాల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
kavitha.1 3

 

Kavitha Law and Order | మల్కాజ్​గిరి ఘటన

హైదరాబాద్ మల్కాజ్​గిరిలో భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటనపై ఆమె స్పందించారు. మూడు నెలల క్రితమే సదరు వ్యక్తి బహిరంగంగా తుపాకీ ప్రదర్శిస్తూ బెదిరింపులకు పాల్పడినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుంటే, ఈరోజు ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలనపై పట్టు లేకపోవడం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయని కవిత ఆరోపించారు. మల్కాజిగిరి ఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  Mohan Naik Arrest | ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌ నాయక్‌కు 14 రోజుల రిమాండ్‌

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *