అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Singareni Comments | సింగరేణి యాజమాన్యంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను వేధించడం ఆపకపోతే సహించేది లేదని హెచ్చరించిన ఆమె, “గతంలో అడవిలో ఉన్న అన్నలందరూ ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kavitha Singareni Comments | వారంతా మా పార్టీలోనే..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఆర్కే-7 భూగర్భ గని వద్ద జరిగిన ‘బాయిబాట’ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం వైఖరిపై ఆమె మండిపడ్డారు. “గతంలో అడవిలో అన్నలు (మావోయిస్టులు) ఉన్నప్పుడు సింగరేణి అధికారులు భయంతో పద్ధతిగా ఉండేవారు. ఇప్పుడు ఆ అండ లేదని యాజమాన్యం అడిగే దిక్కు లేదని భావిస్తోంది. కానీ, వారంతా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు. కార్మికులను ఇబ్బంది పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” అని ఆమె ఘాటుగా హెచ్చరించారు.
Kavitha Singareni Comments | గేట్లు తోసుకుని లోపలికి..
ఆర్కే-7 గనిని సందర్శించి కార్మికుల సమస్యలు వినేందుకు ప్రయత్నించిన కవితను సింగరేణి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె తన అనుచరులతో కలిసి గేట్లను తోసుకుని లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో అక్కడి సిబ్బందికి, హెచ్ఎంఎస్ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Kavitha Singareni Comments | యాజమాన్యంపై కవిత విమర్శలు..
కార్మికుల వేధింపులను తక్షణమే ఆపాలని కోరిన కవిత, యాజమాన్యంపై పలు ఆరోపణలు చేశారు. ప్రతి సంవత్సరం కార్మికులకు దక్కాల్సిన లాభాల వాటాను తగ్గించి నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ పాత పద్ధతులు, పాత టెక్నాలజీనే వాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మహిళా ఉద్యోగులకు కనీస వసతులు లేవని, వారి సమస్యలపై యాజమాన్యం ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను సరిచేయాలని, భూగర్భ గనులను మరింత విస్తరించాలని డిమాండ్ చేశారు.
Kavitha Singareni Comments | రాజకీయాల్లో హాట్ టాపిక్..
కొద్ది రోజుల క్రితం మావోయిస్టు మాజీ అగ్రనేత ‘దేవ్ జీ’ని కవిత పరామర్శించిన నేపథ్యంలో, తాజాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు త్వరలో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇది కూడా చదవండి: ITI Walking Association | ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక