అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Cases | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ( Revanth Reddy ) నమోదైన పలు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, ఈ కేసులకు సంబంధించిన తుది తీర్పును రిజర్వ్ చేసింది.
Revanth Reddy Cases | ఏమిటీ కేసు?
2019లో జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో, అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ పోలీస్ స్టేషన్లలో మొత్తం 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించడం, రోడ్‌షోలతో ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారనేది పోలీసుల ప్రధాన అభియోగం.

Revanth Reddy Cases | కోర్టులో వాదనలు..
తమపై నమోదైన ఈ కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగంగా పెట్టినవని, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు సంబంధించి నేర నిరూపణకు ఎలాంటి బలమైన ఆధారాలు లేవని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది వాస్తవమని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ప్రస్తుతం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో, ఈ వ్యవహారంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Armoor Urban Park | ముస్తాబైన ఆర్మూర్ అరణ్య అర్బన్ పార్క్.. ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి