Executive Engineer Bribery | వారంలో రిటైర్మెంట్​.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

ఒడిశా రాయగడలోని రూరల్ వర్క్స్ డివిజన్-I ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ పట్నాయక్‌ లంచం తీసుకుంటూ దొరికాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Executive Engineer Bribery | ఒడిశా రాయగడ్​లోని రూరల్ వర్క్స్ డివిజన్-I (RWD-I) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ పట్నాయక్‌ లంచం తీసుకుంటూ దొరికాడు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఒడిశా విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. రూ. 50 లక్షల విలువైన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి, కొత్త టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి అవసరమైన పని అనుభవ ధృవీకరణ పత్రాన్ని (work experience certificate) జారీ చేయడానికి ఈ లంచం అడిగాడు. బిల్లు మొత్తం రూ.50 లక్షలు కాగా.. అందులో 5 శాతం (రూ.2.5 లక్షలు) లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. అనంతరం దానిని రూ.రెండు లక్షలకు తగ్గించాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు.

Executive Engineer Bribery | ఇంట్లో సోదాలు

విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి పట్నాయక్ లంచం తీసుకుంటుండగా రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయన నివాసాలు, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాయగడలోని ఆయన ప్రభుత్వ నివాస గృహం నుండి అదనంగా రూ. 3.39 లక్షల నగదును విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పట్నాయక్ జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. వారం రోజుల్లో రిటైర్​ అవుతున్నా సదరు అధికారి లంచం తీసుకోవడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Mumbai Heavy Rains | ముంబైని ముంచెత్తిన వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *