అక్షరటుడే, వెబ్‌డెస్క్: Private Education Feudalism | ప్రస్తుత కార్పొరేట్, ప్రైవేట్ విద్యా వ్యవస్థలు పాత తరం నాటి భూస్వామ్య పోకడలను సంతరించుకున్నాయని, ఇవి కేవలం “నయా భూస్వామ్య వ్యవస్థలుగా” రూపాంతరం చెందాయని ఫులే అంబేడ్కర్ ఆలోచన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య మలిక్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (DATA) ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర కుమార్‌ను అక్రమంగా విధుల్లోంచి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు, వివరణలు కోరకుండా ఏకపక్షంగా తొలగించడం చట్టవిరుద్ధమని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి:Telangana Education Budget | కుర్చీలు మారినా.. క్లాస్‌రూం తలరాత మారలే: బడ్జెట్లో విద్యకు కేటాయింపులపై ప్రొఫెసర్ ఎంఏ మాలిక్ విమర్శఇది కూడా చదవండి: IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం
Private Education Feudalism | పాత కాలపు దోపిడీకి ఆధునిక రూపం
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు శ్రామిక వర్గాలను ఏ విధంగానైతే బానిసలుగా చూసి, శ్రమ దోపిడీకి గురిచేశారో.. నేడు కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు లెక్చరర్లు, ప్రొఫెసర్లు, చివరికి స్వీపర్ల వరకు అదే రీతిలో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పారిశ్రామిక రంగంలో కార్మికులకు కనీస చట్టపరమైన రక్షణలు ఉన్నప్పటికీ, విద్యా సేవారంగంలో UGC, AICTE నిబంధనలను ప్రైవేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయని విమర్శించారు. తనిఖీలకు వచ్చే అధికారులు కూడా నిబంధనలను గాలికొదిలేసి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!
Private Education Feudalism | రాజకీయ పాలకుల వైఫల్యంపై విమర్శలు
రాష్ట్రంలోని విద్యాశాఖలను, విద్యాసంస్థలను ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల చేతుల్లో పెట్టడంపై ఆయన రాజకీయ విమర్శలు గుప్పించారు. గతంలో మంత్రులుగా పనిచేసిన మల్లారెడ్డి వంటి పెద్దలే విద్యాసంస్థల యజమానులుగా ఉండటం వల్లనే ఇలాంటి దోపిడీ వ్యవస్థ మరింత బలపడిందని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం రూ. 22,000 ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు ఏ విధంగానూ సరిపోదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఒక చిన్న రూమ్ కూడా ఆ ధరకు దొరకదని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!
Private Education Feudalism | ‘వికసిత్ భారత్’ ఒక దొంగ లెక్కల మోడల్!
కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 2047 ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) నినాదం ఒక మోసపూరితమైనదని ఆయన కొట్టిపారేశారు. అదానీ, అంబానీల వంటి కార్పొరేట్ దిగ్గజాల సంపదను, దేశంలోని శ్రామిక వర్గం యొక్క సగటు ఆదాయాన్ని కలిపి యావరేజ్ (సగటు) లెక్కలు చూపిస్తూ దేశం అభివృద్ధి చెందిందని భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు.
“కాకులను కొట్టి గద్దలకు వేసే” ఈ వినాశకర అభివృద్ధి మోడల్ దేశానికి శ్రేయస్కరం కాదని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే ‘ఇంక్లూసివ్ అండ్ సస్టైనబుల్ వికసిత్ భారత్’ (సమతుల్య, సుస్థిర అభివృద్ధి) కోసం దీర్ఘకాలిక పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Private Education Feudalism | యాజమాన్యాలకు హెచ్చరిక
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (VC) ప్రైవేట్ సంస్థల ఒత్తిళ్లకు లొంగకుండా, నిబంధనలను కఠినంగా అమలు చేసి చరిత్రలో ఘనుడిగా నిలవాలని, హీనుడిగా మిగిలిపోవద్దని హితవు పలికారు.
2027 నాటికి మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జన్మదినోత్సవ (ద్విశతాబ్ది) సందర్భాన్ని పురస్కరించుకుని పూలే అంబేడ్కర్ ఆలోచన సమితి ఆధ్వర్యంలో ఏడాది పొడవునా వాడవాడలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలు తమ దోపిడీ ధోరణిని మార్చుకోకపోతే, గతంలో భూస్వామ్య వ్యవస్థ ఎదుర్కొన్న తిరుగుబాటునే మళ్లీ చవిచూడాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి….