అక్షరటుడే, ఇందూరు: Olympic Run | యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పీసీసీ చీఫ్(PCC Chief), ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్(Bomma Mahesh Kumar) అన్నారు. నగరంలో(Nizamabad) జిల్లా ఒలింపిక్ సంఘం(Olympic Association) ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Olympic Run | ఒలింపిక్ క్రీడల స్ఫూర్తితో..
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఒలింపిక్ క్రీడల స్ఫూర్తి అయిన క్రమశిక్షణ, ఐక్యత, శాంతి, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. యువత క్రీడల్లో(Youth Sports) ఎక్కువగా పాల్గొనాలన్నారు. తద్వారా రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో జిల్లా ఒలింపిక్ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఒలింపిక్ డే రన్‌కు జెండా ఊపి ప్రారంభించి, క్రీడాకారులతో కలిసి కొంతదూరం పరుగెత్తి వారిని ఉత్సాహపర్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, నగర మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నుడా ఛైర్మన్ కేశ వేణు, ఆకుల లలిత, చంద్రశేఖర్ గౌడ్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సీషెల్స్‌లోని ఒక ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.