అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Saikrishna Lockup Death | సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులు అయిన హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని లొంగిపోయారు.
విజయవాడ (Vijayawada) కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను సీఐ నాగరాజ్ కస్టడీలో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీఐకి ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానితో పాటు సీఐ స్నేహితుడు సహకరించారు. వీరి కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. అయితే సీఐ నాగరాజ్ అరెస్ట్‌తో వీరు పరారు అయ్యారు. తాజాగా పోలీసుల ఇదుట హెడ్ కానిస్టేబుళ్లు లొంగిపోయారు.
Saikrishna Lockup Death | ఏసీపీ సూచన ఎదుట
సౌత్ ఏసీపీ మానస (ACP Manasa) ఎదుట లొంగిపోయిన అశోక్, నాని సరెండర్ అయ్యారు. వారిని ఆమె ప్రశ్నించారు. అనంతరం అశోక్, నానిని సిట్ అధికారుల దగ్గరకు తీసుకెళ్లారు. మరోవైపు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇవాళ పిటిషన్ విచారణకు రీచ్ అవకపోవడంతో రేపు విచారణ కోర్టు విచారించనుంది. కేసును సీబీఐకి ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిని కూడా చదవండి : Warangal Development | దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు కిషన్ రెడ్డి సవాల్!