Rythu Bharosa | 9 రోజుల్లో ‘రైతు భరోసా’ పూర్తి చేస్తాం : మంత్రి పొన్నం

రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం (State Government) నేటి నుంచి రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. హుస్నాబాద్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తాము ఆలస్యంగా రైతు భరోసా వేస్తున్నామని బీఆర్​ఎస్​ విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018-19లో వర్షాకాలంలో మొదటి సారి రైతు బంధు రూ.4 వేల చొప్పున బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు చెక్కులు ఇచ్చారని, అనంతరం ఎన్నికలు కావడంతో నేరుగా ఖాతాల్లో జమ చేశారన్నారు. అప్పుడు రైతుబంధు పూర్తి చేయడానికి 4 నెలల 5 రోజులు సమయం పట్టిందని పేర్కొన్నారు. 2021లో 5 నెలల 11 రోజులు పట్టిందని తెలిపారు. 2021-22లో రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు అమ్మి ఆ పైసలతో రైతుబంధు వేశారని గుర్తు చేశారు.

Rythu Bharosa | రూ.27 వేల కోట్లు ఇచ్చాం

బీఆర్ఎస్​ హయాంలో పదేళ్లలో రూ.73 వేల కోట్లు రైతు భరోసా జమ చేశారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక 2025 వానాకాలంలో 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు. యాసంగి సీజన్​లో రెండు ఎకరాల వరకు ఇచ్చామని, ప్రస్తుతం 9 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాంమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో 27 వేల కోట్లు రైతాంగానికి ఇచ్చిందని వెల్లడించారు.

Rythu Bharosa | రైతుల సంక్షేమం కోసం…

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) అన్నారు. రైతులకు సన్న వడ్లు బోనస్, పనిముట్లు ఇస్తున్నామని తెలిపారు. ఎరువులకు సంబంధించి కేంద్రం బాధ్యత వహించాలన్నారు. బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ప్రతి రైతు వేదిక దగ్గర యూరియాపై ఏఈవోలు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Sigachi Blast Compensation | సిగాచి బాధితులను మోసం చేసిన ప్రభుత్వం : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *