Harish Rao | పాలమూరు పరువు తీస్తున్న రేవంత్​రెడ్డి : హరీశ్​రావు

రాష్ట్రంలో మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్​ రైతులను మోసం చేసిందని విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. పాలమూరు పరువు తీస్తున్నారని మండిపడ్డారు. జడ్చర్లలో బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్​ రైతులను మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్​ హయాంలో కేసీఆర్​ హామీ ఇవ్వకున్న రైతుబంధు పథకం తీసుకొచ్చారని చెప్పారు. కానీ రేవంత్​రెడ్డి రూ.15 వేల రైతు భరోసా వేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

Harish Rao | రైతు వంచన సభ

brs 8

రేవంత్‌రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని హరీశ్​రావు అన్నారు. యాసంగి రైతుబంధు పూర్తి స్థాయిలో వేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ రూ. 29,300 కోట్లు రైతులకు బాకీ పడిందన్నారు. KCR చేతిలో ఉంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు. పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్‌గా మారిందని ధ్వజమెత్తారు. షాపులో యూరియా ఉంటే యాప్ ఎందుకని ప్రశ్నించారు. షాపులో లేదు కాబట్టే యాప్ అంటూ కథలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని కాంగ్రెస్​ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.

 

దీనిని కూడా చదవండి : Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *