Paidi Rakesh Reddy | మహేష్ కుమార్ గౌడ్​కు దమ్ముంటే ఆర్మూర్​ నుంచి పోటీ చేయాలి : ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

మహేష్ కుమార్ గౌడ్​కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్​ నుంచి పోటీ చేయాలని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి సవాల్​ విసిరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Paidi Rakesh Reddy | మహేష్ కుమార్ గౌడ్​కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్​ నుంచి పోటీ చేయాలని ఆర్మూర్(Armoor)​ ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి సవాల్​ విసిరారు. ఈ మేరకు నగరంలో(Nizamabad) బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Paidi Rakesh Reddy | ఆ జిల్లాలకే నిధులు

పీసీసీ చీఫ్(PCC Chief)​ ఎమ్మెల్సీకి.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం ఉప ఎన్నికల్లో నిలబడితే ఎవరు గెలుస్తారో చూద్దామని రాకేష్​ రెడ్డి అన్నారు. జిల్లాలో అభివృద్ధి శూన్యమని కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారన్నారు. మహేష్​ కుమార్​ గౌడ్​కు ఎమ్మెల్సీ పదవి కానీ పీసీసీ అధ్యక్ష పదవి గాని ఎవరికి లాభీయింగ్​ చేస్తే వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవని మహేష్ కుమార్ గౌడ్ తన గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి జిల్లాకు అన్యాయం చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్​కు అతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్​నగర్​, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు మాత్రమే నిధులు ఇస్తుందని.. మిగతా జిల్లాలను పట్టించుకోవట్లేదన్నారు.

Paidi Rakesh Reddy | ఢిల్లీకి సూట్​ కేసులు మోస్తూ..

నెలకు ఒకసారి ఢిల్లీకి (Delhi) సూట్ కేసులు మోస్తూ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్​లు పదవులు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు 210 లేఖలు రాసినా నిధులు మాత్రం మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, దమ్ముంటే జిల్లా అభివృద్ధికి నిధులు తెచ్చి రాజకీయ చతురత చూపాలని సవాల్​ విసిరారు. భూమికి మూడు అడుగులు మాత్రమే ఉన్న ఈరవత్రి అనిల్ తనను నరుకుతా అని వ్యక్తిగత దూషణలకు దిగాడని.. మరోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దిగజారుడు రాజకీయాలకు వెళ్లవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఫ్లోర్​ లీడర్​ ప్రమోద్, నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

armoor

ఇది కూడా చదవండి: మ్యాన్‌హోల్‌లో కొట్టుకుపోయిన వ్యక్తి

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *