Secunderabad Boy Kidnapping | సికింద్రాబాద్ బాలుడి కిడ్నాప్​ కేసు.. డాడీ అని పిలవడంతో ఎత్తుకెళ్లిన నిందితుడు

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో కిడ్నాప్​ అయిన బాలుడిని ఆచూకీ దొరికింది. అతడిని పోలీసులు క్షేమంగా తల్లికి అప్పగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Secunderabad Boy Kidnapping | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల నిఖిల్ కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. ఆ బాలుడి ఆచూకీ దొరకడంతో పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)​లో ఇటీవల ఓ బాలుడు కిడ్నాప్​ అయిన విషయం తెలిసిందే. ఉప్పల్ చిలకానగర్ పరిధిలో నివసించే రాజేశ్వరి కుమారుడు నిఖిల్ (5) జూన్ 20న రాత్రి మిస్​ అయ్యాడు. బాలుడితో కలిసి విజయవాడ వెళ్లేందుకు అమ్మమ్మ స్వరూప సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు వచ్చింది. ప్లాట్‌ఫామ్‌పై మనవడు నిఖిల్‌ను పక్కన కూర్చోబెట్టుకుని విశ్రాంతి తీసుకుంటుంది. ఈక్రమంలోనే స్వరూపకు నిద్ర పట్టగా.. ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన తిరిగి ఉప్పల్​కు వచ్చి కూతురికి విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Secunderabad Boy Kidnapping | ఆచూకీ లభించకపోవడంతో..

సికింద్రాబాద్ పోలీసులు (Secunderabad Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభింలేదు. దీంతో బాలుడి తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. ఈక్రమంలో జూలై 2న బాలుడిని తీసుకెళ్లిన నిందితుడు స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. బాలుడిని పోలీసులకు అప్పగించాడు.

Secunderabad Boy Kidnapping | కిడ్నాప్​ వార్తలతో భయపడి..

ఏపీలోని రాజోలుకు చెందిన షేక్ అహ్మద్ అలీ ప్రస్తుతం హైదరాబాద్‌ చింతల్ రాంనగర్ పరిధిలో నివసిస్తున్నాడు. జూన్​ 20న సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పరిసరాల్లో తిరుగుతుండగా.. నానమ్మ నుంచి తప్పిపోయి ఏడుస్తున్న నిఖిల్.. అహ్మద్ అలీని చూసి పొరపాటున డాడీ అని పిలిచాడు. కుటుంబ కలహాలతో అతడి భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. దీంతో నిఖిల్​ను తీసుకెళ్లి పెంచుకోవాలని అలీ ప్లాన్​ వేశాడు. వెంటనే బాలుడిని తీసుకొని తన ఇంటికి వెళ్లాడు. బాలుడిని 12 రోజుల పాటు ఇంట్లోనే ఉంచాడు. అయితే నిఖిల్​ కిడ్నాప్​ వార్తలు రావడంతో అహ్మద్​ అలీ భయపడ్డాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో తానే లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. జులై 2న ఆ బాలుడిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించి లొంగిపోయాడు. దీంతో పోలీసులు బాలుడిని తల్లికి అప్పగించారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Lodge Death | లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *