అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR Farmhouses | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుటుంబానికి అన్ని ఫామ్‌హౌజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ (Midjil) మండల కేంద్రంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. 2006 జులై 4న మిడ్జిల్ మండల ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఆరోజు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. ఇవాళ పెద్ద వృక్షమైందని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాడు జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మిడ్జిల్ ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. మిడ్జిల్ ప్రజలు తనపై పెట్టిన నమ్మకమే.. ఇవాళ ఈస్థాయికి తీసుకెళ్లిందన్నారు.
KCR Farmhouses | రబ్బానీకి పదవి ఇవ్వాలి
మిడ్జిల్ జెడ్పీటీసీగా 2006లో తాను కాంగ్రెస్ అభ్యర్థి రబ్బానిపై గెలిచానన్నారు. నాడు రబ్బానిని జెడ్పీ ఛైర్మన్ చేయాలని అప్పటి సీఎం వైఎస్ఆర్ భావించారని, కానీ ప్రజలు తనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. నాడు తన చేతిలో ఓడిన రబ్బానికి ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వాలని సూచించారు. 35 ఏళ్లుగా రబ్బాని కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రేవంత్‌రెడ్డి కోరారు. 20 ఏళ్లలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు.
KCR Farmhouses | ప్రజలను దోచుకొని..
ప్రజలను దోచుకొని కేసీఆర్ కుటుంబం ఫామ్‌హౌజ్‌లు నిర్మించుకుందని సీఎం ఆరోపించారు. ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌజ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్‌కు జన్వాడలో 100 ఎకరాల్లో ఫామ్‌హౌజ్, హరీశ్‌రావుకు మొయినాబాద్‌లో 50 ఎకరాల ఫాహ్హౌజ్, కవితకు శంకర్‌పల్లిలో 25 ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. పదేళ్లలో ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.
KCR Farmhouses | పాపాల భైరవుడు కేసీఆర్
సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. నాడు గద్దర్ కలవడానికి వెళ్తే ఫామ్‌హౌస్ ఎదుట 4 గంటల పాటు ఎండలో నిల్చొబెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పని చేసిన గద్దర్‌ను ఎండలో నిల్చొబెట్టిన ఆయనకు ఉరిశిక్ష వేసిన తక్కువే అన్నారు. ఫామ్‌హౌజ్‌లో బంధించిన పాపల భైరవుడు రావాలని ఆయన కుమారుడు, అల్లుడు బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో వారితో పాటు దోపిడీ చేసిన అధికారులు ఈ రోజు రూ.వందల కోట్లు అక్రమాస్తులతో ఏసీబీకి పట్టుబడుతున్నారని తెలిపారు. దొర దురహంకారాన్ని మరోసారి బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మిడ్జిల్ మండలాన్నిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దత్తత తీసుకోవాలి- CM రేవంత్ రెడ్డి#revanthreddy @revanth_anumula pic.twitter.com/t3ZUD1MInS
— Rare Telangana (@RareTelangana) July 4, 2026
దీనిని కూడా చదవండి : Tribal Development Telangana | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క