అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad House Theft | విలాసవంతమైన జీవితం కోసం చోరీల బాట పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏకంగా 70కి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం.. తిరిగి వచ్చిన అనంతరం మళ్లీ దొంగతనాలు చేయడం నిందితుడికి అలవాటు అయింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చింతల్‌లోని వాజ్‌పేయ్ నగర్ నివాసం ఉండే శ్రీరామ్ నరసింహ చారి అలియాస్ నయామి అలియాస్ రాజేష్ ఏడో తరగతిలో చదువు మానేశాడు. జీవనోపాధి కోసం వడ్రంగి పని నేర్చుకున్నాడు. కారు డ్రైవర్‌గా సైతం పని చేసేవాడు. అయితే తన విలాసవంతమైన జీవనశైలికి అవసరమైన డబ్బు కోసం, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించాడు. ఇల రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా ఇళ్లలో చోరీ చేశాడు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి (CP Sumathi) ఆదేశాల మేరకు హయత్ నగర్ పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు 42.3 తులాల బంగారు ఆభరణాలు, 87 తులాల వెండి వస్తువులు, రూ. 42,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad House Theft | తీరు మార్చుకోకుండా..
నిందితుడు ఇప్పటికే పలు సార్లు జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై విడుదలైన ప్రతిసారీ తన ప్రవర్తనను మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతూ జైలుకు వెళ్తూ వచ్చాడు. నవంబర్ 2025లో సైబరాబాద్ (Cyberabad) పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఇంటి దొంగతనం కేసులో అతను జైలుకు వెళ్లాడు. జైలులో ఉన్న సమయంలో, భువనగిరి పోలీసులు అతనిపై పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్‌ను (NBW) అమలు చేసి అతన్ని భువనగిరి జైలుకు తరలించారు; ఆ తర్వాత జనవరి 2026లో అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.
Hyderabad House Theft | హయత్‌నగర్ ప్రాంతాల్లో..
శ్రీరామ్ నరసింహ చారి ఏప్రిల్‌లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిందితుడు మళ్లీ ఇంటి దొంగతనాలకు (Hyderabad House Theft ) పాల్పడ్డాడు. అతను ముఖ్యంగా హయత్ నగర్ (Hayath Nagar), మునగనూరు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాడు. ఏప్రిల్ 15న హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఒక ఇంటి తలుపు, బీరువా తాళాలను పగలగొట్టి, నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించాడు. దొంగిలించిన సొత్తును ఆన్లైన్ ద్వారా పరిచయమైన ఒక అపరిచిత వ్యక్తికి విక్రయించి, వచ్చిన డబ్బును ఆన్లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఏప్రిల్ 16న మునగనూరులోని ద్వారకా వెంకట సాయి నగర్లో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును ఎత్తుకెళ్లాడు. జూన్ 296న హయత్ నగర్‌లోని ద్వారకా వెంకట సాయి నగర్లో రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అతడిని అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : Konda Surekha | కడియం వర్సెస్ కొండా సురేఖ.. సీఎంకు లేఖ రాసిన మంత్రి