Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం

ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa Scheme | ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్​రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.

వానాకాలం సీజన్​లో రైతు భరోసా నిధుల విడుదలను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) జూన్​ 30న ప్రారంభించారు. ఖమ్మంలో సభ పెట్టి నిధులు విడుదల చేయాలని భావించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఆ సమయంలో వర్షాలతో సభను పెట్టలేదు. దీంతో సీఎం హైదరాబాద్​ నగరంలోని శిల్పకళా వేదికలో నిధుల విడుదలను ప్రారంభించారు. తొలి రోజు రెండు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేశారు.

Rythu Bharosa Scheme | రూ. 9 వేల కోట్లు

Rythu Bharosa Scheme

 

ఈ సీజన్​లో అందరి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని సీఎం తెలిపారు. రూ.9 వేల కోట్లను విడుదల చేస్తామన్నారు. ఈ మేరకు గురువారం వరకు నిధులు విడుదల చేశారు. శుక్రవారం చివరి విడుత రూ.1,009 కోట్లను సీఎం విడుదల చేయనున్నారు. దీంతో అందరి రైతుల ఖాతాల్లో డబ్బుల జమ అవుతాయయని ప్రభుత్వం తెలిపింది. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా విజయవంతంగా జమ చేయడంతో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని  చింతకాని మండలం జగన్నాథపురంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇది కూడా చదవండి..: RTC Bus Theft | మద్యం మత్తులో.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *