అక్షరటుడే వెబ్‌డెస్క్: Shabad Murder Case |రంగారెడ్డి జిల్లా ( Rangareddy ) షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆదివారం ( 12 జులై )కొత్తూరు మండలం అక్కివేనిగూడెం సమీపంలో అతడిని పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Shabad Murder Case | పోలీసుల గాలింపు ఫలించినట్టేనా?
ఆరుగురిని దారుణంగా హత్య చేసినప్పటి నుంచి రాజ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు 9 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. నిన్ననే నిందితుడు ఉపయోగించిన కారును చేగూరు రైల్వే లైన్ సమీపంలో గుర్తించిన పోలీసులు, గాలింపును మరింత ముమ్మరం చేశారు.
Shabad Murder Case | అదుపులోకి తీసుకున్నట్లు..
స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించి, టిఫిన్ సెంటర్ ఎక్కడ ఉందో అడుగుతున్న ఒక వ్యక్తిపై అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిందితుడిని పట్టుకున్నది స్థానిక పోలీసులా లేక ప్రత్యేక దర్యాప్తు బృందమా అనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అధికారికంగా ధృవీకరించిన తర్వాతే ఈ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నిందితుడు దొరికాడన్న వార్తతో స్థానికులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు