అక్షరటుడే, వెబ్‌డెస్క్: Constable Suicide | డీజీపీ కార్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
డీజీపీ కార్యాలయం (DGP Office)లో స్వామి అనే కానిస్టేబుల్ పని చేస్తున్నారు. గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆయన వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్దం వినిపించడంతో పోలీసులు వెళ్లి చూడగా.. అప్పటికే చనిపోయాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Constable Suicide | వాళ్లు మంచివారు
స్వామి మృతదేహం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. అందులో తన భార్య పిల్లలు మంచివాళ్లని, వారిని ఏమి అనవద్దని రాశాడు. తాను దెయ్యం అయి అయినా వారిని చూసుకుంటానని ఓ నోట్ బుక్‌లో రాసి స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలు, ఉద్యోగ సంబంధ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: HYDRAA Lakes | చెరువులు సిద్ధం చేయాలి : హైడ్రా కమిషనర్