అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు రాష్ట్రంలో తానే అధికారంలో ఉంటానని స్పష్టం చేశారు. ఫిన్లాండ్, జర్మనీల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు.
లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ కోసం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు. అమెరికాలో అడుక్కునేవాళ్లు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడుతారన్నారు. చైనా, జర్మనీలో ఇంగ్లీష్ వచ్చినవాళ్లు 10 శాతం కూడా ఉండరని పేర్కొన్నారు. కానీ వాళ్లు ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నారని ప్రశ్నించారు. అమెరికాపై తగ్గించి జర్మనీ, జపాన్లపై ఫోకస్ పెట్టాలని ఆయన యువతకు సూచించారు.
Revanth Reddy | విద్యలో నాణ్యత పెరగాలి
విద్య అందింది, ఆకలి తీరింది.. కానీ ప్రపంచంతో పోటీ పడటానికి ఇది సరిపోదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యలో నాణ్యత పెరగాలని సూచించారు. ప్రపంచంతో మనపిల్లలు పోటీ పడాలన్నారు. వెనుకబాటు తనానికి ఆస్తికి సంబంధం లేదు.. ఆస్తి ఉన్నా, చదువులేక ఇబ్బందిపడుతున్న వాళ్లూ ఉన్నారని పేర్కొన్నారు. ఆదాయం పెంచాలి, ప్రజలకు పంచాలనేదే తమ ఆలోచన అన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 8 వేలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
Revanth Reddy | ఎందుకు రాజీనామా చేయాలి
తెలంగాణకు పూర్తిస్థాయి విద్యాశాఖమంత్రి లేరని కొందరు అంటున్నారని సీఎం అన్నారు. మంచిగా పని చేసినందుకు తాను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా?.. ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు తప్పుకోవాలా అన్నారు.
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్
వారికి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు
సంవత్సరానికి లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/GOTxohpomi
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2026
దీనిని కూడా చదవండి : Heavy Rains | భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ