GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మకూర్​ జీపీవో రాజేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: GPO ACB Trap | జగిత్యాల జిల్లా (Jagtial District) మెట్​పల్లి మండలం ఆత్మకూర్​ గ్రామపాలన అధికారి (GPO) మాతే రాజేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడిని అధికారులు అరెస్ట్ చేశారు.

కథలాపూర్​ మండలం దంపేట గ్రామానికి చెందిన రాజేశ్​ ఆత్మకూర్​ గ్రామంలో జీపీవోగా పని చేస్తున్నాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణ కోసం ఆయన వద్ద దరఖాస్తు చేసుకున్నారు. జీపీవో తయారుచేసిన విచారణ నివేదికను రెవెన్యూ అధికారికి సమర్పించడం కోసం అతను రూ.5,000/- లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. కరీంనగర్​ యూనిట్ అధికారులు జీపీవో రాజేశ్​ను వల పన్ని పట్టుకున్నారు.

GPO ACB Trap | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి..: Siddapur Reservoir | సిద్దాపూర్​ రిజర్వాయర్​తో సాగునీటి కష్టాలు దూరం: ఎమ్మెల్యే పోచారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *