CM Revanth Reddy | కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కరువు రావాలని కొంతమంది కర్ణాటక, తమిళనాడు వెళ్లి క్షుద్ర పూజలు చేశారని సీఎం ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరువు రావాలని, జనాలు చావాలని కొంతమంది కర్ణాటక, తమిళనాడు వెళ్లి క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు.

హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. కేపీహెచ్​బీ కాలనీలో భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ​అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది కేసీఆర్ పరిస్థితి అని విమర్శించారు. ఇవాళ కేసీఆర్‌ను మింగేయడం కోసం అఘోర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ చేతబడి తిరగబడితే.. వారిని అష్టదిగ్బంధనం చేస్తుందన్నారు. ఎల్​నినో వచ్చిన సమయంలో దేవుడు వానలు కురిపించాడన్నారు. వాళ్లు అఘోర పూజలు చేసినా.. దేవుడు తనవైపు ఉండి వానలు కురిపించి జలాశయాలు నింపాడన్నారు.

CM Revanth Reddy | కూకట్​పల్లిని అభివృద్ధి చేస్తాం

కూకట్‌పల్లి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటానని సీఎం తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడుతామన్నారు. పదేళ్ల ఆ పరిపాలనను, రెండేళ్ల ఈ పరిపాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు. ఆ నాడు దొడ్డు బియ్యం ఇస్తే కోళ్లకు దాణాగా పెట్టారని, తాము రేషన్​ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామని వెల్లడించారు. బీఆర్​ఎస్​ హయాంలో ప్రవేశ పెట్టిన అన్ని పథకాలను తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందిస్తామన్నారు. 55 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్​ నగరంలో ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామని తెలిపారు. ఈ ఇళ్లకు రిజిస్ట్రేషన్​ ఛార్జీలు రద్దు చేస్తామన్నారు.

దీనిని కూడా చదవండి : Eagle Force | ఈగల్ టీమ్‌పై కుక్కను వదిలిన గంజాయి ముఠా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *