Revanth Reddy Medaram Visit | మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు

ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Medaram Visit | ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో తాడ్వాయి మండలంలోని మేడారానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాల నడుమ పూజారులు ఆచారాల ప్రకారం సీఎంను ఆలయ ప్రాంగణంలోకి ఆహ్వానించారు.

Revanth Reddy Medaram Visit | వనదేవతలకు మొక్కులు..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క-సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం), చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందాలని తల్లులను కోరుకున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పూజారులు సీఎంకు వేదాశీర్వచనం అందించి, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

Revanth Reddy Medaram Visit | మంత్రి సీతక్క రాఖీ వేడుక..

ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వన దేవతల సమక్షంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Revanth Reddy Medaram Visit | అధికారుల స్వాగతం..

హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన వారిలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పో తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.

 

ఇది కూడా చదవండి:  Dimaagi Naxals | ‘మేధో నక్సల్స్​’ వ్యాఖ్యలు వారిని ఉద్దేశించి కాదు : కేంద్ర మంత్రి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *