అక్షరటుడే, వెబ్డెస్క్ : Jupalli Krishna Rao | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో సోమవారం జూపల్లి పర్యటించారు. కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Jupalli Krishna Rao | కష్టపడ్డ వారికి అవకాశాలు
ప్రజలకు సేవ చేసిన నాయకులు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తులో తగిన అవకాశాలు లభిస్తాయని జూపల్లి పేర్కొన్నారు. ఎస్ఐఆర్ తదుపరి ప్రక్రియను పార్టీ శ్రేణులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఉన్న గ్రూపు విభేదాలు పార్టీ బలోపేతానికి ఆటంకంగా మారకూడదన్నారు. నేతలు అందరు సమష్టిగా పనిచేయాలని సూచించారు. వ్యక్తుల కంటే పార్టీనే సుప్రీం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని స్పష్టం చేశారు.
Jupalli Krishna Rao | ఐక్యతతో సాగాలి
పార్టీ పదవులు, నియామకాల విషయంలో నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చని మంత్రి అన్నారు. అయితే తుది నిర్ణయం టీపీసీసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని స్పష్టం చేశారు. విభేదాలను పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు సాగాలని నాయకులకు సూచించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలన్నారు.
ఇది కూడా చదవండి..: Bhavesh Mishra IAS Collector | నిజామాబాద్ కలెక్టర్‌గా నిర్మల్ కలెక్టర్ భావేష్ మిశ్రాకు బాధ్యతలు!