Nizamabad Crime Records | సీపీ కార్యాలయంలో రికార్డులను పక్కాగా రూపొందించాలి

నగరంలోని సీపీ కార్యాలయంలో కేసుల రికార్డులను పక్కాగా రూపొందించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Crime Records | నగరంలోని (Nizamabad) సీపీ కార్యాలయంలో కేసుల రికార్డులను పక్కాగా రూపొందించాలని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. కార్యాలయంలోని సీసీఆర్​బీ సెక్షన్​ను బుధవారం ఆయన తనిఖీ చేశారు.

Nizamabad Crime Records | నేర గణాంకాలు.. దర్యాప్తు పురోగతి

సీసీఆర్​బీ సెక్షన్‌లో నిర్వహిస్తున్న కేసుల నమోదు, నేర గణాంకాలు , దర్యాప్తు పురోగతి వివరాలను సీపీ తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల నుంచి అందుతున్న కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల వివరాలను సమీక్షిస్తూ, పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కేసులకు సంబంధించిన రికార్డులు, గణాంకాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.

Nizamabad Crime Records | సమన్వయంతో పనిచేయాలి

నేరాలపై సమగ్ర గణాంకాలను సిద్ధం చేసి, వాటి ఆధారంగా నేర నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. సీసీఆర్​బీ విభాగం, పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయం మరింత మెరుగుపర్చి, కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని కమిషనర్ సూచించారు. కేసుల దర్యాప్తు, పురోగతికి సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో అందిస్తూ, పోలీసు శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా కొనసాగించేలా సీసీఆర్బీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, సీసీఆర్​బీ ఏసీపీ గురునాయుడు, సీఐ అంజయ్య, పాండేరావు, ఎస్సై వరప్రసాద్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Harish Rao Surveyors Protest | యువత తిరగబడితే రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదు: హరీశ్ రావు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *