తెలంగాణRevanth Reddy | బీఆర్​ఎస్ శవంతో సమానం.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy | బీఆర్​ఎస్ శవంతో సమానం.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్​ఎస్​పై సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ శవంతో సమానమన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Revanth Reddy | బీఆర్​ఎస్​ (BRS)పై సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ శవంతో సమానమన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్​ పార్టీ పెట్టారని, ఆ పర్పస్​ సాల్వ్ అయిందన్నారు. శవానికి ఎంత అలంకరణ చేసినా తిరిగి ప్రాణం రాదని, బీఆర్ఎస్ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉందన్నారు. ఆ పార్టీకి ఘన చరిత్ర ఉండొచ్చు కానీ, భవిష్యత్తు మాత్రం లేదన్నారు.

అసెంబ్లీ ఆవరణలో సోమవారం సీఎం రేవంత్​రెడ్డి మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. బీఆర్​ఎస్​పై విమర్శలు చేశారు. రాజకీయాల్లో ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంటుందన్నారు. అది నెరవేరిన తర్వాత దానికి ప్రాముఖ్యత ఉండదని చెప్పారు. ఈ క్రమంలోనే బీఆర్​ఎస్​ మనుగడ దాదాపు ముగిసిందని వ్యాఖ్యానించారు.

Revanth Reddy | కవిత పార్టీపై..

కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం స్పందించారు. కొత్త పార్టీ గురించి మనకు ఎందుకన్నారు. ఉన్న పార్టీ ఉంటుందా. ఉండదో చూడండని సెటైర్​ వేశారు. కేసీఆర్​ తనకు ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరారు. వారసత్వ రాజకీయాల కోసమే కొందరు ఆయన చెడు కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy | అహంకారంతో..

పదేళ్ల అధికారంలో బీఆర్ఎస్ నాయకులకు అహంకారం, గర్వం వచ్చాయని రేవంత్​రెడ్డి విమర్శించారు. దీంతో ప్రజలు 2023 ఎన్నికల్లో ఓడించారన్నారు. అనంతరం పార్లమెంట్​ ఎన్నికల్లో (Parliamentary Elections) ఒక్క సీటు కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్ కుటుంబంతో తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం తమ ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతోందని విమర్శించారు.

Revanth Reddy | సీబీఐ డైరెక్టర్​ను కలుస్తాం

కాళేశ్వరం విషయంలో కోర్టు తీర్పుపై రేవంత్​రెడ్డి స్పందించారు. కమిషన్ నియామకం ఏక పక్షమని ఎక్కడా కోర్టు చెప్పలేదన్నారు. కమిషన్ నియామకం చట్టబద్ధమేనని.. జీవో కొట్టేయడం కుదరదని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అయినా బీఆర్​ఎస్​ నాయకులు తాము గెలిచినట్లు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. సెక్షన్ 8B, 8C ప్రకారం.. ప్రస్తుతం చర్యలు వద్దని మాత్రమే కోర్టు చెప్పిందని తెలిపారు. కమిషన్ నివేదిక యధాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం (Kaleshwaram)పై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్​ చేశారు. లేకపోతే ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్​ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే ఇటీవల హరీశ్​రావు ఢిల్లీ వెళ్లారన్నారు.

Revanth Reddy | రాష్ట్రంలో రెండు కూటములు

తెలంగాణ రాష్ట్రంలో రెండు కూటములు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, కోదండరాం ఒక కూటమి అని, బీఆర్ఎస్, బీజేపీ మరో కూటమి అన్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Heatwave | హైదరాబాద్‌లో ముదురుతున్న ఎండలు.. 42 డిగ్రీలకు చేరిన వేడి తీవ్రత!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...