Revanth Reddy US Tour | సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బ్రేక్!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించాల్సి ఉండగా,  కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy US Tour | తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికాలో ( US )పర్యటించాల్సి ఉండగా,  కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘తెలంగాణ రైజింగ్’ (TelanganaRising) ప్రతినిధి బృందంలో భాగంగా ఆయన అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పరిణామంతో ఆయన తన లండన్ పర్యటనను కుదించుకుని, బోస్టన్‌కు వెళ్లాల్సిన ప్రణాళికను రద్దు చేసుకుని ఆగస్టు 23న నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

Revanth Reddy US Tour | నిరాకరణకు కారణాలు..

ముఖ్యమంత్రి అధికారిక యూకే, యూఎస్ పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను (MEA) సంప్రదించగా.. వారు కేవలం యూకే పర్యటనకు మాత్రమే ఆమోదం తెలిపారు. అధికారిక ప్రతినిధి బృందం ఇప్పటికే యూకే చేరుకున్న తర్వాత అమెరికా పర్యటన నిలిచిపోయినట్లు సమాచారం అందింది. “రాజకీయ కోణం” కారణంగానే ఈ అనుమతిని నిరాకరించినట్లు MEA పేర్కొంది.

Revanth Reddy US Tour | విద్యారంగ అభివృద్ధి కోసమే ..

ఈ నిర్ణయంపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థలను తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఐవీ లీగ్ , గ్లోబల్ సంస్థల ద్వారా మన యువతకు ఉత్తమ విద్య, నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతోనే ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. జాతీయ అభివృద్ధి, యువత భవిష్యత్తు రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Revanth Reddy US Tour | యూకే టూర్..

అమెరికా పర్యటనకు అనుమతి రాకపోయినప్పటికీ.. హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌ వంటి ప్రముఖ సంస్థలతో కుదుర్చుకోవాల్సిన అవగాహనా ఒప్పందాలు (MoU), భాగస్వామ్యాలను ఖరారు చేయాలని సీఎం తనతో పాటు వెళ్లిన అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన చెప్పారు.

మరోవైపు, ముఖ్యమంత్రి తన షెడ్యూల్ ప్రకారం రాబోయే రెండు రోజులు యూకేలోనే పర్యటించనున్నారు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రతినిధులతో పాటు అకడమిక్స్, స్కిల్లింగ్ సంస్థల ప్రతినిధులను కలవనున్నారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించేందుకు, ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ అడ్డంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కాబోవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Defense Liquor Seize | అక్రమంగా డిఫెన్స్​ మద్యం విక్రయం.. కేసు నమోదు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *