అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy development | కామారెడ్డి నుంచి కేసీఆర్ కూడా పోటీ చేశారని.. ఆయనకు ఇక్కడి ప్రజల సమస్యలపై, పట్టణ (Kamareddy) అభివృద్ధిపై బాధ్యత ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Kamareddy development | గంప గోవర్ధన్ వ్యాఖ్యలపై ఫైర్..
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గురువారం వరదలపై చేపట్టిన నిరసన సందర్భంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, పిండ ప్రదనాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో రూ.1,400 కోట్లు ఉన్నాయని, అందులో నుంచి రూ.100 కోట్లు తీసుకొచ్చి కామారెడ్డి అభివృద్ధికి కృషి చేయాలని సవాల్ విసిరారు. గత రెండున్నరేళ్లలో గంప గోవర్ధన్ ఏనాడూ ప్రజల పక్షాన మాట్లాడింది లేదని, ప్రభుత్వ పథకాలపై స్పందించిన దాఖలాలు లేవని విమర్శించారు.
Kamareddy development | షబ్బీర్ అలీ సాయం
గతేడాది వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తమ నాయకుడు షబ్బీర్ అలీ స్పందించి సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలను చివరికి సీఎంను కూడా కామారెడ్డికి రప్పించారని తెలిపారు. సీఎం వచ్చి వెళ్లాక ప్రభుత్వం సత్వర పనుల కోసం రూ.10 కోట్లు మంజూరు చేసిందని, వరద నష్టంపై షబ్బీర్ అలీ సీఎంకు వివరించి నిధులు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
సీఆర్ఆర్ ఫండ్స్ కింద రూ.50 కోట్ల ప్రతిపాదనలు పంపితే రూ.25 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. ఎఫ్డీఆర్ కింద రూ.16 కోట్లు, యూఐడీఎఫ్ కింద రూ.18.70 కోట్లు వచ్చాయని వెల్లడించారు. వరద నీరు సజావుగా వెళ్లేందుకు రూ.8.80 కోట్లతో స్ట్రాం కాలువల నిర్మాణానికి నిర్ణయించామని, టెండర్ కూడా పూర్తయిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టలేని పనులను తమ నాయకుడు చేపిస్తున్నారన్నారు. సీఎంపై, తమ నాయకులపై మాజీ ఎమ్మెల్యే అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు.
Kamareddy development | కేసీఆర్ను ఎందుకు ఓడించారో సమాధానం చెప్పాలి
తమ ప్రభుత్వ హయాంలో కామారెడ్డి అభివృద్ధి చెందిందని చెబుతున్నారని, అదే నిజమైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను కామారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారో సమాధానం చెప్పాలని నాయకులు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు గన్మెన్లను పెట్టుకోగా లేనిది నక్సలైట్ల దాడిలో తప్పించుకున్న తమ నాయకుడికి గన్మెన్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. బతికున్న వ్యక్తులకు పిండ ప్రదానం చేయడం హిందూ సాంప్రదాయం కాదని, తక్షణమే బీఆర్ఎస్ నాయకులు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే బయటకు రావడం సంతోషకరమని, ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడంలో తప్పు లేదని, అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్, పండ్ల రాజు, కామారెడ్డి సొసైటీ ఛైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఇప్ప శ్రీనివాస్, గుడుగుల శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, కన్నయ్య, కాళ్ళ గణేష్, కౌన్సిలర్ అంజాద్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: సామాన్యుడిపై పోలీసుల అత్యుత్సాహం