Kamareddy BRS Councillors | కామారెడ్డి బల్దియాలో ఉద్రిక్తత.. రాజీనామా చేస్తామన్న బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BRS Councillors | వార్డులో సమస్యలపై పట్టు ఉన్న తమను వదిలి నేరుగా వార్డుల్లో అధికారులు తిరగడంపై బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డి (Kamareddy) కౌన్సిల్​ సమావేశం నిర్వహించారు.

Kamareddy BRS Councillors | పోడియం ఎదుట ఆందోళన..

సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. తమ వార్డులో అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. తన వార్డులో నెల క్రితమే జేసీబీతో పని చేయిస్తుంటే మధ్యలోనే తీసుకెళ్లారని, ప్రస్తుతం అదే పని తనకు చెప్పకుండా వచ్చి జేసీబీతో చేయించడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్ ప్రశ్నించారు. ఏదైనా అడిగితే షబ్బీర్ అలీ చెప్పారు, నయీమ్ చెప్పారని పనులు చేస్తే తాము ఉండి ఎందుకుని ఆయన ప్రశ్నించారు. ఇక తాము వార్డులకు అవసరం లేదని.. రాజీనామా చేస్తామని, పనులు చేసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నల్ల కండువా కౌన్సిల్ టేబుల్​పై వేసి నిరసన తెలిపారు.

ఇది కూడా చదవండి..: Tadkol Chowrasta Safety | బాలిక మృతితో స్పందించిన అధికారులు.. ప్రమాదాల నివారణకు చర్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *