Vemula Prashanth Reddy | కవిత ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనపై చేసిన ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్​: Vemula Prashanth Reddy | టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తనపై చేసిన ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. లింబాద్రి లక్ష్మీనృసింహాస్వామి సన్నిధిలో బీఆర్​ఎస్​ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవిత వ్యాఖ్యలపై స్పందించారు.

Vemula Prashanth Reddy | కేసీఆర్​ సైనికుడిని..

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారం కోల్పోగానే తాను కాంగ్రెస్​ నాయకులతో మంతనాలు జరిపానని పేర్కొనడం పూర్తిగా అవాస్తవమన్నారు. కేసీఆర్​కు, పార్టీకి నేను ఎల్లప్పుడూ విశ్వసనీయమైన సైనికుడిగానే ఉన్నానన్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నానని.. నేను కాంగ్రెస్‌తో మంతనాలు జరిపాననడం కేవలం అసత్య ప్రచారమన్నారు. కవితనే రహస్యంగా కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారా అనేదానిపై ఆమెకే స్పష్టత ఉండాలని వ్యాఖ్యానించారు.

Vemula Prashanth Reddy | ‘కాంగ్రెస్ బాకీ కార్డు’తో వినూత్న నిరసన..

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విస్మరించి, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసగించిందని మాజీ మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బాకీలను వివరిస్తూ రూపొందించిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను స్వామివారి పాదాల చెంత ఉంచారు. అనంతరం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని దేవుళ్లపై ఒట్టు వేసి, అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి మాట తప్పారని దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి..: Pension Protest Day | అపరిష్కృత సమస్యలపై ఉద్యోగుల నిరసన.. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ‘పెన్షన్ విద్రోహ దినం’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *