అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Congress Thousand Days | హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Ex MLA Shakeel) పేర్కొన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా బోధన్ (Bodhan) పట్టణంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Congress Thousand Days | బోధన్ చౌరస్తాలో..
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా బోధన్ అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. షకీల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని.. వెయ్యి రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని షకీల్ పేర్కొన్నారు. 420 మీటర్ల కాంగ్రెస్ అబద్ధపు హామీల ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, సీనియర్ నాయకులు గిరిధర్ గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: TGSRTCలో కండక్టర్ పోస్టులు..!