Jagga Reddy Comments | కేసీఆర్ చేసినదాని కంటే పెద్ద మోసం ఉంటుందా? : జగ్గారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతల విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Jagga Reddy Comments | కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతల విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించారు. అమలులో ఉన్న సంక్షేమ పథకాలను పక్కనపెట్టి, అమలు కానీ కొన్ని అంశాలపైనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీలపై ప్రభుత్వం , పార్టీ త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.

Jagga Reddy Comments | ప్రజలకు పూర్తి స్వేచ్ఛ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రజలకు పూర్తి స్వేచ్ఛ లభించిందని, ఎవరైనా ధర్నాలు చేయాలన్నా, సచివాలయానికి వెళ్లాలన్నా ఇప్పుడు ఆ స్వేచ్ఛ దక్కిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ త్యాగం ఎంతో ఉందని, అనివార్య పరిస్థితుల వల్లే బీజేపీ కూడా రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు.

Jagga Reddy Comments | కేటీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు..

నోరుంది కదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడటం తగదని జగ్గారెడ్డి హితవు పలికారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి కేసీఆర్ స్వయంగా సీఎం అయ్యారని, అంతకంటే పెద్ద మోసం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్( KTR ), హరీశ్ రావు అసెంబ్లీకి రాకపోయినా తమకు ఎలాంటి నష్టం లేదన్నారు. కేసీఆర్ ఉద్యమం వల్లే తెలంగాణ ఉద్యమం ఉధృతమైందని, అయితే ఆయన పార్టీ పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Yoga Competitions | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *