Bodhan Task Force Raid | బోధన్‌లో కలకలం.. మీసేవ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి

బోధన్​ పట్టణంలోని ఓ మీసేవ కేంద్రంలో టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Bodhan Task Force Raid | మీసేవ కేంద్రం ముసుగులో నకిలీ ధృవపత్రాల తయారీ జరుగుతోందన్న సమాచారంతో టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటన బోధన్ (Bodhan)​ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.

Bodhan Task Force Raid | పట్టణంలోని రాకాసిపేట్​లో..

బోధన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు రాకాసిపేట్‌లోని ఓ మీసేవ కేంద్రంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సోదాల్లో పలు అనుమానాస్పద పత్రాలతో పాటు కలర్ ప్రింటర్‌ను  స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో లభించిన పత్రాలు, రికార్డులు, కంప్యూటర్‌కు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి వసీం, ముక్రం అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఏ రకమైన ధృవపత్రాలు తయారు చేశారు.. వాటిని ఎక్కడ, ఏ అవసరాలకు వినియోగించారు.. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా.. అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పరిశీలన అనంతరం మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: భారత్‌లో మరో 100 ఎయిర్​పోర్ట్​లు..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *