Monkey Menace | కోతుల బెడద నివారణకు వినూత్నప్రయోగం..

కోతుల బెడద నివారణకు వినూత్నప్రయోగం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ: Monkey Menace | కోతుల బెడద నివారణకు వినూత్నప్రయోగం చేశారు. బాల్కొండ (Balkonda) మండలం కిసాన్​నగర్​లో గ్రామంలో కోతుల(Monkey) బెడద నివారణకు గ్రామస్తులు యువకుడితో చింపాంజీ వేషం వేయించారు.

Monkey Menace | కోతులను దాటించే ప్రయత్నం..

కోతుల కారణంగా గ్రామంలో చిన్నాపెద్దా ఎన్నో అవస్థలు పడ్డామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇళ్లలోకి చొరబడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వాటిని తరిమేందుకు ఈ విధానాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఆదివారం పెద్దసంఖ్యలో కోతులను గ్రామం నుంచి తరిమేసినట్లు చెప్పారు. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామరాజు గౌడ్, వీడీసీ అధ్యక్షుడు కొండ అశోక్, 10వ వార్డు సభ్యురాలు శ్యామల శ్రీనివాస్, ఎంపల సుదర్శన్, ప్రవీణ్, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ గోపాల్ పేరు చెప్పగానే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *