అక్షరటుడే, వెబ్డెస్క్: Revanth Reddy Education | తెలంగాణ Telangana లో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రంలో కొత్త విద్యా విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. విద్యాశాఖకు కేటాయించే నిధులను గణనీయంగా పెంచడం తన లక్ష్యమని పేర్కొన్నారు.
Revanth Reddy Education | విద్యాశాఖకు 15 శాతం నిధులు పెంచాలని లక్ష్యం
విద్యాశాఖకు 15 శాతం నిధులు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖకు ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేరంటూ వస్తున్న విమర్శలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యాశాఖను తన వద్ద ఉంచుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉందని తెలిపారు. ఈ శాఖ అత్యంత కీలకమైనదని భావించినందుకే తానే బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Revanth Reddy Education | రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది విద్యారంగం
విద్యాశాఖ తన వద్ద ఉండటం ఇష్టం లేదంటే, ఒక్క నిమిషంలోనే ఆ బాధ్యతలను తన మిత్రులకు అప్పగించగలనని సీఎం వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే శాఖను తన పరిధిలో ఉంచుకున్నట్లు వివరించారు.
AP Govt DA | ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు డీఏలు.. బకాయిల చెల్లింపునకు షెడ్యూల్
విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విద్యా రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో విధానపరమైన మార్పులు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.