Dancer Raju Arrest | సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ‘ఢీ’ డ్యాన్సర్ రాజు అరెస్టు

సినిమా అవకాశాల పేరుతో రాజు తనను లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dancer Raju Arrest | సినిమా Cinema అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘ఢీ’ డ్యాన్స్‌ షో విన్నర్​ డ్యాన్సర్ రాజును హైదరాబాద్​లోని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 9న బాధిత యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సినిమా అవకాశాల పేరుతో రాజు తనను లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది.

Dancer Raju Arrest | నిందితుడు రిమాండ్​

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్యాన్సర్ రాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Zee Entertainment Downfall Story | జీ ఎంటర్టైన్మెంట్ సంక్షోభం..సుభాష్ చంద్ర ‘జీ’ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది?

కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం రాజుకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *