Mulugu Tahsildar ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్​

ములుగు జిల్లా గోవిందరావుపేట తహశీల్దార్ సృజన్​ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mulugu Tahsildar ACB | ములుగు (Mulugu) జిల్లా గోవిందరావుపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ (ACB) అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. తహశీల్దార్​​ సృజన్​ కుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

మండలంలోని ఓ గ్రామానికి చెందిన లింగాల శ్రీలత అనే మహిళ పూర్వికుల భూమి వారసత్వ బదిలీ కోసం తహశీల్దార్​ సృజన్​ కుమార్​ రూ.15 వేల లంచం డిమాండ్​ చేశాడు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.14 వేలకు తగ్గించాడు. ఈ విషయాన్ని శ్రీలత భర్త ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి శుక్రవారం తహశీల్దార్​ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్​ చేశారు.

Mulugu Tahsildar ACB | అవినీతి కేంద్రాలుగా..

రాష్ట్రంలోని పలు తహశీల్దార్​ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. అటెండర్లు, ఆపరేటర్ల నుంచి మొదలు పెడితే తహశీల్దార్ల వరకు కాసుల వేటలో నిమగ్నం అవుతున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. భూముల రిజిస్ట్రేషన్​ కోసం వచ్చే వారి నుంచి సైతం డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. ఆపరేటర్ల ద్వారా పలువురు తహశీల్దార్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Danam Nagender | సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదు.. దానం నాగేందర్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *